పిట్టమాంసం కూర (Bird Curry Preparation in Telugu)

కావలసిన పదార్ధాలు: 

పిట్టమాంసం : అర కిలో
పచ్చిమిర్చి : మూడు
ఉల్లిపాయలు : రెండు 
వెల్లుల్లి రేకలు : నాలుగు 
దనియాలు : టీ స్పూన్ 
అల్లం : చిన్న ముక్క 
ఉప్పు : తగినంత 
కారం : టీ స్పూన్ 
యాలుకలు : మూడు 
లవంగాలు : మూడు 
చెక్క : చిన్న ముక్క 
నూనె : మూడు టేబుల్ స్పూన్లు 
పసుపు : కొంచెం 
గసగసాలు : టీ స్పూన్ 

తయారుచేయు విధానం: 

1) ముందుగా అల్లం, వెల్లుల్లి, లవంగాలు కలిపి ముద్దలా నూరాలి.
2) అలాగే యాలుకలు, దనియాలు, దాల్చిన చెక్క గసగసాలు కలిపి మషాలా పొడి కొట్టి ఉంచాలి.
3) పిట్ట మాంసం కడిగి   ఉప్పు వెయ్యకుండా నూరిన అల్లం,  వెల్లుల్లి,  లవంగాలు ముద్ద వేసి ఒక గ్లాసు  నీళ్ళు పోసి  స్టవ్ ఫై ఒక అరగంట ఉడికించాలి.
4) తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలుపి పది నిముషాలు ఉడికించి దించాలి.
5) ఇప్పుడు వేరే కళాయి స్టవ్ ఫై పెట్టి నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
6) ఇవి వేగాక ఉడికించుకున్న పిట్టమాంసంను   అందులో వేసి కలిపి ఒకనిముషం ఉడికించి మషాలా పొడి వేసి కలపాలి.ఇప్పుడు కూర రెడి అవ్వుతుంది.
7) దించేముందు కొత్తిమీర కర్వేపాకు వేసి మూతపెట్టి స్టవ్ ఆపాలి.