బొమ్మిడాయిలు పెరుగు కూర(Fish Cord Curry in Telugu )



కావలసిన పదార్దాలు:

బాగా తెల్లగా తోమి కడిగి శుబ్రంచేసి బొమ్మిడాయి చేప ముక్కలు.: అర కేజీ

గట్టి గడ్డ పెరుగు : పావుకేజీ


ఉల్లి పాయలు : రెండు

పచ్చికొబ్బరి పేస్టూ  : అర కప్పు

అల్లం వెల్లుల్లి  పేస్టూ : టేబుల్ స్పూన్

కారం : రెండు టీ స్పూన్లు

ఉప్పు : సరిపడ

గసగసాలు పేస్టు : టేబుల్ స్పూన్

మషాలా పొడి : టీ స్పూన్

పచ్చిమిర్చి : రెండు

నూనె : కప్పు

కొత్తిమీర : కొద్దిగా

తయారుచేయు విధానం :

1) చేపముక్కల్లో కారం, ఉప్పు, పసుపు, పెరుగు వేసి కలిపి ఒక గంట నానబెట్టాలి.

2) గంట తరువాత ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి పేస్టూ, గసగసాలు పేస్టూ, అల్లం వెల్లుల్లి  పేస్టూ వేసి కలిపాలి.

3) ఇప్పుడు స్టవ్ ఫై కళాయి పెట్టి నూనే వేడి చేసి కాగాక అన్ని కలిపిన బొమ్మిడాయి చేప ముక్కలు వేసి చిన్నగా కలిపి సన్నని మంటమీద ఉడికించాలి.

4) కూర ఉడికి నూనె ఫైకి తేలుతుంది. ఇప్పుడు గరం మషాలా, కొత్తిమీర వేసి స్టవ్ ఆపాలి.

5) ఈ కూరలో నీళ్ళు పోయ్యగూడదు. పెరుగు తో మాత్రమే  ఉడుకుతుంది.

కాబట్టి చాలా రుచిగా ఉంటుంది.