చేపలు కోప్తా కర్రి (Fish Cofta Curry in Telugu )


కావలసిన పదార్దాలు
పెద్ద చేప ముక్కలు : పావుకేజీ (ముళ్ళు మొత్తం తీసివెయ్యాలి.)
పచ్చిమిర్చి : మూడు
ఉల్లి పాయలు : రెండు
కొత్తిమీర : కట్ట
గ్రుడ్డు : ఒకటి
నిమ్మకాయ : ఒకటి
గరం మషాలా : టీ స్పూన్
బ్రెడ్ పొడి : కప్పు
ఉప్పు : తగినంత
కారం : టీ స్పూన్
పసుపు : కొద్దిగా
జీలకర్ర పొడి : అర టీ స్పూన్  
దనియాలు పొడి : టీ స్పూన్
టామాటలు : పావుకేజీ
నూనె : వేయించటానికి సరిపడ
అల్లం వెల్లుల్లి పేస్టు : అర టీ స్పూన్

తాయారు చేయు విధానం:

1) ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి , ముక్కలుగా కట్ చెయ్యాలి.
2) టమాటాలు గ్రైండ్ చేసి చిక్కటి రసం తియ్యండి.(గుజ్జులా )
3) స్టవ్ ఫై కొద్దిగా నూనె వేడి చేసి ఉల్లిముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
4) ప్రక్కస్టవ్ ఫై మరో కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
5) నూనె కాగేలోపు కోప్తాలు రెడి చేసుకుందాం.
6) ముళ్ళు తీసిన చేపముక్కల్ని మిక్సిలో వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
7) దీనికి నిమ్మరసం, ఉప్పు, కోడిగుడ్డు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ముద్దలా కలపాలి.
8) దీనిని నిమ్మకాయంత సైజులో ఉండలు చేసి బ్రెడ్ పొడిలో దొర్లించి నూనె లో ఎర్రగా వేయింఛి ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
9) ఇప్పుడు వేరే కళాయి స్టవ్ ఫై పెట్టి కొద్దిగా నూనె వేడిచేసి  ఉల్లి ముక్కలు దోరగా వేయించాలి.
10) తరువాత అల్లం వేల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, దనియాల పొడి వేసి కాసేపు వేయించాలి.
11) ఇప్పుడు గ్రైండ్ చేసిన టమాటా రసం వేసి కాసేపు వేయించి కొద్దిగా నీళ్ళుపోసి వేయించిన ఫిష్ కోప్తాలను వేసి అయిదు నిముషాలు ఉడికించాలి.
12) గ్రేవీ దగ్గర పడ్డాక స్టవ్ ఆపి కొత్తిమీర చల్లి మూత పెట్టాలి.

ఇప్పుడు వడ్డించుకోవటానికి ఫిష్ కోప్తా కర్రి రెడి.