పనీర్ మెంతు ఆకుకూర (Panir Mentu Curry in Telugu )


కావలసిన పదార్దాలు: 

పనీర్ తరుగు : కప్పు 
మెంతు  ఆకు : అరకప్పు 
టొమాటో తరుగు : అరకప్పు 
అల్లం వెల్లుల్లి పేస్టూ : అర టీ స్పూన్ 
కారం : అర టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
గరం మసాలా : అర టీ స్పూన్ 
ఉల్లి ముక్కలు : అర కప్పు 
పచ్చిమిర్చి ముక్కలు : టీ స్పూన్ 
కొత్తిమీర : పసుపు  
నూనె : రెండు  టేబుల్ స్పూన్లు  


తయారుచేయు విధానం :

1) స్టవ్ వెలిగించి నూనె వేడి చేసి పనీర్ తురుము వేసి కాస్త వేయించి పక్కనపెట్టాలి.

2) మిగిలిన నూనెలో ఉల్లిముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.

3) తరువాత అల్లం వెల్లుల్లి పేస్టూ, మెంతుఆకు, టామాటాముక్కలు, పసుపు వేసి చిన్న మంటమీద ఉడికించాలి.

4) టమాటాలు మెత్త బడ్డాక ఉప్పు, కారం వేసి కలపి వేయించిన పనీర్ వేసి కాసేపు కలపండి.

5) రెండు నిముషాలు ఆగి గరం మషాలా, కొత్తిమీర వేసి స్టవ్ ఆపండి.

6) ఈ కూర అన్నంలోకే కాదు పరాటాల్లోకి కుడా చాలా బాగుంటుంది.