పొటాటో చిప్స్( స్టిక్స్ ) (Aloo Chips in Telugu )

కావలసిన పదార్దాలు :

బంగాళా దుంపలు : నాలుగు 
నూనె : తగినంత 
సెనగపప్పు : అరకప్పు 
జీలకర్ర : పావుకప్పు 
మినపప్పు : అరకప్పు 
కరివేపాకు : కొద్దిగా 
ఎండుమిర్చి : ఐదు 
వెల్లుల్లి : పది రెబ్బలు 
కొత్తిమీర: కట్ట 

తయారుచేయు విధానం :

1) బంగాళా దుంపలు చెక్కు తీసి సన్నగా కట్ చేసుకొని ఉప్పు కలిపిన నీటిలో పది నిముషాలు ఉంచి నీటిని వంచేయ్యాలి.ముక్కలకు తడి లేకుండా తుడవాలి.
2) వెల్లుల్లి, ఎండుమిర్చి ని కొద్దిగా నూనె వేసి వేయించాలి.
3) నూనె లేకుండా జీలకర్ర, మినపప్పు, సెనగపప్పులు వేయించాలి.
4) ఇప్పుడు ఈ పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర మిక్సిలో వేసి పొడి చెయ్యాలి.
5) ఇప్పుడు నూనె వేడి చేసి కాగిన తరువాత తడి లేకుండా తుడిచి కట్ చేసిన బంగాళా  దుంపలు  ముక్కలు వేసి కరకరలాడేలా వేయించాలి.
6) ఇప్పుడు నూనె మొత్తం వేరే గిన్నెలోకి వంచి కొద్దిగా నూనె ఉంచి దానిలో కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి.
7) అవి వేగాక వేయించిన బంగాళా దుంప ముక్కలు, మిక్సి చేసిన పప్పులపొడి, ఉప్పు వేసి కలిపి గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి.
ఇవి పిల్లలు ఇష్టంగా తింటారు.