కావలసిన పదార్దాలు:
మేక మాంసం - అరకిలో
చుక్కకూర - నాలుగు కట్టలు
ఉల్లి ముక్కలు - కప్పు
పచ్చిమిర్చి ముక్కలు - టేబుల్ స్పూన్
కారం - టీ స్పూన్
ఉప్పు - తగినంత
అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్
మసాల - అర టీ స్పూన్
నూనె - అర కప్పు
కొత్తిమీర - చిన్న కట్ట
తయారుచేయు విధానం:
చుక్కకూర ముక్కలుగా చేసి కడిగి పక్కన పెట్టాలి.
మాంసం కడిగి, కారం ,ఉల్లి, మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించాలి.
ఇప్పుడు ఉప్పు వేసి మరి కాసేపు ఉడికించాలి.
ఇప్పుడు నూనె వేడి చేసి కరివేపాకు ,జీలకర్ర, ఆవాలు, వేసి వేగిన తరువాత చుక్కకూర వేసి కలిపి మెత్తగా ఉడికిన తరువాత ఉడికించిన మాంసం వెయ్యాలి.ఐదు నిముషాలు ఉడికించి మసాలా, కొత్తిమీర వేసి సర్వ్ చెయ్యాలి.

Post a Comment