మటన్ కీమా చుక్కకూర (Keema Chukka Leaves Curry in Telugu )

కావలసిన పదార్దాలు.

మటన్  కీమా - అర కిలో

వేయించిన శెనగ పప్పు - కప్పు 
నూనె - పావు కిలో 
లవంగాలు- ఆరు 
దాల్చిన చెక్క - చిన్న ముక్క 
పసుపు - అర టీ స్పూన్ 
కారం  - టీ స్పూన్ 
దనియాలు - ఒక టీ స్పూన్ 
పచ్చిమిర్చి - మూడు 
కొబ్బరి  - చిన్న ముక్క 
గసాలు - రెండు స్పూన్లు 
ఉల్లిపాయలు - ఒకటి 
అల్లం - చిన్నముక్క  
వెల్లుల్లి - ఒకటి 
కొత్తిమీర - కట్ట 

తయారుచేయు విధానం 

1) ఉల్లి, మిర్చి, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి కలిపి ముద్దగా నూరాలి.శెనగ పప్పు పొడి చెయ్యాలి.
2) చెక్క, దనియాలు, లవంగాలు, గసాలు, పొడి చెయ్యాలి.ఉల్లి ముద్ద, శనగపప్పుపొడి, మసాల పొడి వీటిని కీమా ౩ తో కలిపి ముద్దలా నూరాలి.
3) దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనె లో దోరగా వేయించాలి.
4)  ఇప్పుడు చుక్కకూర ముక్కలుగా కట్ చేసి కడిగి ఉప్పు, కారం, వేసి మెత్తగా ఉడికించాలి.
5) దీనిలో వేయించినకీమా ఉండలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించాలి.
 6) ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడి చేసి పోపుదినుసులు వేసి  చెక్క  లవంగాలు వేసి వేగాక కీమా చుక్కకూర వేసి కలిపి స్టవ్ ఆపాలి.
 కొత్తిమీర వేసి సర్వ్ చెయ్యాలి.