
కావలసిన పదార్దాలు
చికెన్ - అరకేజి
ఉల్లిపాయలు - రెండు
టమాటో - ఒకటి
అల్లం - చిన్నముక్క
కొబ్బరి తురుము - అర కప్పు
చింత చిగురు ఆకులు ముక్కలుగా కట్ చేసినవి - రెండు కప్పు
పుదీనా - కట్ట
పచ్చిమిర్చి - మూడు
మసాల - టీ స్పూన్
గసాలు - రెండు టీ స్పూన
కొత్తిమీర - కట్ట
జీడిపప్పు - పది
వెల్లుల్లి - ఒకటి
యాలుకలు - మూడు
తయారుచేయు విధానం
1) చికెన్ కడిగి పక్కన పెట్టాలి.పుదీనా, కొత్తిమీర, చింతచిగురు కట్ చేసి కడిగి పక్కన పెట్టాలి.
2) గసాలు, జీడిపప్పు, యలుకులు, అల్లం, వల్లుల్లి, కొబ్బరి ముద్దలా నూరాలి.
3) స్టవ్ ఫై గిన్నె పెట్టి నూనె వేడి చేసి ఉల్లి, మిర్చి. టమాటాలు వేసి వేగనివ్వాలి.పుదీనా కూడా వేసి వేగనిచ్చి కడిగిన చికెన్ వేసి నీరు ఇంకి పోయే వరకు నూనెలో వేగనివ్వాలి.
4) ఇప్పుడు నూరిన మసాలముద్ద, ఉప్పు, కారం,
పసుపు ,చింత చిగురు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి వుడికించాలి.
5) ఇప్పుడు మసాలాపొడి, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి స్టవ్ ఆపాలి.
అంటే చికెన్ ,చింతచిగురు కూర రెడీ.
Post a Comment