పెరుగు తాలింపు అన్నం (Cord Rice in telugu)


కావలసిన పదార్దాలు :

పాలు - లీటరు
బియ్యం - అర కేజి
పచ్చి మిర్చి - నాలుగు
అల్లం - చిన్న ముక్క
కేరెట్ - ఒకటి
ఆవాలు - రెండు స్పూన్లు
జీలకర్ర - రెండు స్పూన్లు
సెనగ పప్పు- రెండు స్పూన్లు
మినపప్పు- రెండు స్పూన్లు
జీడి పప్పు - పది 
ఎండు మిర్చి- మూడు 
కరివేపాకు - మూడు రెమ్మలు
ఉప్పు - తగినంత
కొత్తిమీర - ఒక కట్ట

తయారుచేయువిధానం :

1)  పాలు కాచి తోడు వేసి పెరుగు పులుపు రాకుండా రెడీ చేసుకోవాలి.
2) ఇప్పుడు  అన్నం మెత్తగా వండాలి వండిన  అన్నాన్ని బాగా చల్లారబెట్టాలి.
 3) ఈ అన్నంలో అప్పుడే తోడుకున్న పెరుగుని వేసి బాగా కలపాలి.
4)  ఈ పెరుగు అన్నంలో తగినంత ఉప్పు,చిన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి ముక్కలు,సన్నగా తురిమిన కేరెట్ వేసి బాగా కలపాలి.
5) ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో నూనె వేసి వేడిచేయ్యాలి.
6)  కాగిన తరువాత అందులో సెనగపప్పు,మినపప్పు,జీడిపప్పు వేసి అవి దోరగా వేగిన తరువాత జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి,చిన్నగా తరిగిన అల్లం ముక్కలు,చివరిగా కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
7) అవి బాగా వేగిన తరువాత దించి పక్కన పెట్టి చల్లార్చిలి.
8) ఇప్పుడు చల్లారిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు అన్నంలో వేయించి పెట్టుకున్నతాలింపును నూనె రాకుండా జాగ్రతగా వేయాలి. 
9) ఈ తాలింపు అంతా కలిసేలా పెరుగు అన్నాన్ని బాగా కలపాలి.
10)  దీనీని తరిగిన కొత్తిమీర తో పైన అలంకరిస్తే సరి .
అంతే కర్డ్ రైస్ రెడీ.
11) కావాలనుకుంటే దీన్ని కొంత సేపు ఫ్రిజ్  లో పెట్టి తింటే  చల్ల చల్లగా చాలా బావుంటుంది.