పాపిడి (Som Paapidi in Telugu)

కావలసిన పదార్దాలు :

శెనగ పిండి : రెండు కప్పులు మైదా : రెండు కప్పులు
పంచదార : మూడు కప్పులు
నెయ్యి : పావుకిలో
నీళ్లు: రెండు కప్పులు
పాలు: రెండు టేబుల్ స్పూన్లు
యాలకులు పొడి : అర టీ స్పూన్
బాదం : టీ స్పూన్ 

గుమ్మడి గింజలు : టీ స్పూన్  
కర్బూజ గింజలు : టీ స్పూన్


తయారుచేయు విధానం :

1) ఒక గిన్నెలో శెనగపిండి, మైదా పిండి తీసుకొని రెండింటినీ బాగా కలపాలి.
2) ఇప్పుడు ఒక పాన్ లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. 
3) అందులో శెనగపిండి, మైదాపిండి మిశ్రమాన్ని వేసి, తక్కువ మంట మీద వేయించుకోవాలి.  బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
4) క్రిందికి దింపుకొని చల్లారనివ్వాలి. 
 5) నీళ్ళు, పాలు, పంచాదార వేసి తక్కువ మంటమీద పంచదార పాకంపట్టాలి. చిక్కబడేంత వరకూ కలుపుతూ పాకం తయారు చేసుకోవాలి.
6) ఇప్పుడు పాకంలో  వేయించి చల్లార్చిన పిండిని పోసి  గరిట తో
బాగా కలపాలి.
7) ఇలా కలిపితే ఈ మిశ్రమం దారం వంటి రేకులను(పోగుపోగుగా) ఏర్పడి
 గట్టిపడుతుంది. అంతే సోమ్ పాపిడి రెడీ