రొయ్యలు పకోడీ రెండో రకం (prawns pakoda )

కావలసినపదార్దాలు :

రొయ్యలు : అరకిలో

నువ్వులు : అర కప్పు 
టొమాటో సాస్‌ : టేబుల్‌స్పూన్లు
కొత్తిమీర తురుము : రెండు టేబుల్‌ స్పూన్లు
బియ్యప్పిండి : రెండు టేబుల్‌స్పూన్లు
కార్న్‌ఫ్లోర్‌: :  టేబుల్‌స్పూను
అల్లం,వెల్లుల్లి: టీస్పూను
కారం: టీస్పూను
మిరియాలపొడి : పావుటీస్పూను
అజినవోటో: పావుటీస్పూను
ఉప్పు: తగినంత

తయారుచేయు విధానం: 

1) శుభ్రంచేసిన రొయ్యల్ని ఓ గిన్నెలో వేసి దానిలో నువ్వులు, టొమాటో సాస్‌, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్‌, అల్లం,వెల్లుల్లి, ఉప్పు, కారం, మిరియాల పొడి, అజినవోటో వేసి తగినన్ని నీళ్లు చల్లి కలిపి పది నిమిషాపక్కన పెట్టాలి. 2) ఇప్పుడు నూనె వేడి చేసి రొయ్యల్ని కాగె నూనెలో పకోడీల్లా వేసి బాగా వేయించి వేయించి తీయాలి.