సగ్గుబియ్యం వడలు (saggu biyyam vadalu )

కావలసిన పదార్ధాలు:

సగ్గుబియ్యం : పావు కిలో
బంగాళా దుంపలు : మూడు
పచ్చిమిర్చి: ఆరు
కొత్తిమీర : కట్ట
కరివేపాకు : రెండు రెబ్బలు
జీలకర్ర : ఒక చెంచా
వేరుశనగ పప్పు లేదా పల్లీలు : రెండు గుప్పెళ్ళు
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించటానికి సరిపడా

తయారు చేసే విధానం:

1) సగ్గుబియ్యం రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. 
2) బంగాళాదుంపలు చెక్కు తీసిఉడికించుకోవాలి.వీటిని మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి.
3) వేరుసెనగపప్పువేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
4) పచ్చిమిర్చి ముక్కలుగాకట్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి.
5) ఇప్పుడు నానిన సగ్గుబియ్యంలో ఆలూముద్ద, పల్లీలుపొడిని, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి అన్నిటిని బాగా కలుపుకోవాలి.
6) ఇప్పుడు నూనె వేడి చేసి కాగిన తరువాత అన్ని కలిపిన సగ్గుబియ్యం ముద్దని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకోని వడలుగా చేసి కాగే నూనెలో దోరగా వేయించుకోవాలి. 
అంతే ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం వడలు రెడీ.