
పన్నీర్ మసాల
కావలసిన పదార్ధాలు:
పన్నీరు : పావుకిలోపల్లీలు : అర కప్పు
నువ్వులు : పావు కప్పు
ఉల్లిపాయలు : రెండు
టమోటలు : రెండు
పచ్చిమిర్చి : మూడు
మసాల : అర టీ స్పూన్
పసుపు : అర టీ స్పూన్
కారం : టీ స్పూన్
ఉప్పు : సరిపడ
నూనె : సరిపడ
పోపుగింజలు : టీ స్పూన్
నిమ్మకాయ : ఒకటి
కొత్తిమీర : కొద్దిగా
తయారు చేయు విధానం:
1) బాణలిలో నూనె పోసివేడి అయ్యాక పన్నీరు ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.
2) వీటిని నీటిలో వేసి నీళ్ళు లేకుండా పిండి పక్కనపెట్టాలి.౩) నువ్వులు, పల్లీలు పొడిగా వేయించుకోవాలి.
3) పల్లీలు, నువ్వులు, పచ్చి మిర్చి కలిపి మిక్సి చేసి పక్కన ఉంచుకోవాలి.
4) ఇప్పుడు ఉల్లిపాయలు మిక్సి చేసుకోవాలి. టమాటాలు కూడా మిక్సి చేసుకోవాలి.
5) పనీర్ వేయించిన నూనెను వేరే గిన్నెలోకి తీసేయ్యాలి.
6) మూడు స్పూన్లు నూనె మాత్రం ఉంచి కాగాక పోపుగింజలు వేసి వేయించాలి.
7) అవి వేగాక ఉల్లిపాయ పేస్టు వేసి బాగా వేయించుకోవాలి.
8) ఇప్పుడు టమాటో పేస్టు దీనిలో వేసి వేయించుకోవాలి.
9) ఇది బాగా వేగాక పల్లిల పేస్టు వేసి కలిపి రెండు నిముషాలు మూత పెట్టాలి.
10) ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, గరంమసాల పొడి, సరిపడ నీళ్ళుపోసి రెండు నిముషాలు ఉడికించాలి .
11) ఇప్పుడు పన్నీరు ముక్కలు వేసి మూత పెట్టి మరో అయిదు నిముషాలు ఉడికించాలి.కూర రెడీ అయినట్టే.
12) స్టవ్ ఆపాలి. దీనిపైన నిమ్మరసం, కొత్తిమీర వేసుకోవాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే పన్నీర్ మసాల కూర రెడీ.
Post a Comment