సొరకాయ (ఆనబకాయ )పరోటా కావలసిన పదార్దాలు:
గోధుమ పిండి :రెండు కప్పులు
సొరకాయ తురుము : కప్పు
ఉప్పు : తగినంత
పచ్చిమిర్చి పేస్టు : టీ స్పూన్
కొత్తిమీర తురుము : పావు కప్పు
నూనె : పావు కప్పు
తయారుచేయు విధానం :
1) సొరకాయ తురుములో గోడుమపిండి, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్టు వేసి చపాతీ పిండిలా కలపాలి.
2) నీళ్ళు అవసరం లేదు. సోరకాయలో ఉన్న తడి సరిపోతుంది.
3) ఇప్పుడు దీనిని చపాతీ గా చేసుకొవాలి.
4) ఇలా చేసిన చపాతీలు స్టవ్ ఫై రేకు పెట్టి కొద్దిగా నూనె వేస్తూ చపాతీ కాల్చుకోవాలి.
అంతే సొరకాయ చపాతీ రెడీ.
Post a Comment