మటన్ కబాబ్ (Mutton Kebab in Telugu )

మటన్ కబాబ్ 
కావలసిన పదార్దాలు :

కీమా : పావుకేజీ
పచ్చి బొప్పాయి పేస్టు : టేబుల్ స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్టు : టేబుల్ స్పూన్ 
కారం : అర టీ స్పూన్ 
ఉప్పు : తగినంత  
పసుపు :పావు టీ స్పూన్ 
పుట్నాల పొడి : తగినంత 
వేయించిన ఉల్లి ముక్కల పేస్టు : రెండు టేబుల్ స్పూన్లు 
లవంగాలు : మూడు 
యాలుకులు : రెండు 
దాల్చిన చెక్క : చిన్న ముక్క 
నెయ్యి : ఐదు టేబుల్ స్పూన్లు 

తయారుచేయు విధానం :

1) స్టవ్ ఫై నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు గోధుమ కలర్ వచ్చేవరకు వేయించి పేస్టులా చేసి ఉంచాలి. చెక్క, లవంగాలు, ఇలాచిని పొడి కొట్టాలి.
2) కిమాను శుబ్రంగా కడిగి మిక్సి పట్టాలి .దీనిని ఒకగిన్నేలోకి తీసుకోవాలి.
దీనిలో పచ్చి బొప్పాయి ముక్క పేస్టు చేసి కలపాలి. 
3) తరువాత కారం,ఉప్పు,పసుపు,పొడికొట్టిన మసాల,పుట్నాల పొడి  ,అల్లం వేల్లుల్లిపేస్తూ,వేయించిన ఉల్లిపాయల పేస్టు వేసి బాగాకలపాలి.
4) దీనిని బాగా కలిపాక గిన్నెలో సమంగా చేసి మూత పెట్టాలి.
 5) మసాలా వాసన బయటకు పోకుండా ఉంటుంది .దీనిని ఒక అర గంట
 పక్కన పెట్టాలి. అలా చేస్తే  మసాలా ఫ్లేవర్ అంతా కీమా మిశ్రమం కి పడుతుంది 
6) ఇప్పుడు కిమాను చిన్న చిన్న ఉండలుగా చేసి అర చేతిలో గుండ్రంగా నొక్కి ఒకప్లేటు లో పెట్టుకోవాలి.
7) ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక చేసి పెట్టిన కబాబ్ లు ఒకొక్కటిగా పాన్ మీద వేసి మళ్ళి వీటి ఫైన నెయ్యి వేసి మూతపెట్టి చిన్న మంట మీద కాలనివ్వాలి.
8) అలా రెండు ప్రక్కలా ఎర్ర గా కాలాక ఒక ప్లేటులోకి తీసి సర్వ్ చెయ్యాలి.
అంతే మటన్ కబాబ్స్ రెడీ .