
మటన్ మిర్చి బజ్జి
కావలసిన పదార్దాలు :
కీమా : పావుకేజీ
అల్లం వెల్లుల్లి పేస్టు : టేబుల్ స్పూన్
కారం : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
పసుపు :పావు టీ స్పూన
మైదా : రెండు టేబుల్ స్పూన్లు తగినంత
ఉల్లి ముక్కలు : రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తరుగు : ఒక టేబుల్ స్పూన్లు
పచ్చిమిరపకాయలు : పది
నూనె : వేయించటానికి సరిపడ
తయారుచేయు విధానం :
1) స్టవ్ ఫై నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు గోధుమ కలర్ వచ్చేవరకు వేయించు కోవాలి.దానిలోఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ,కీమా,కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించాలి.
2) తరువాత కొద్దిగా నీళ్ళు పోసి రెండు విజిల్స్ వచ్చాక దించి చల్లారనివ్వాలి.
3) ఇప్పుడు దీనిని మిక్సిలో వేసి మెత్తగా మిక్సి పట్టాలి.
4) మైదాలోకొద్దిగా నూనె, ఉప్పు, నీళ్ళు వేసి చపాతి పిండిలా కలపాలి.
5) పచ్చిమిర్చిని వేడి నీళ్ళల్లో వేసి ఐదు నిముషాలు ఉంచి తీసి నిలువుగా ఒక ప్రక్క గాటు పెట్టి లోపల గింజలు తీసి పక్కన పెట్టాలి.
6) ఇప్పుడు కలిపిన మైదా ముద్దను చిన్న చిన్న ఉండలుగా తీసుకోని పూరీలా చేసి సన్నని రిబ్బన్ లా కట్ చేసుకోవాలి.
7) స్టీవ్ మీద నూనె పెట్టి వేడి చెయ్యాలి.
8) ఇప్పుడు గాట్లు పెట్టిన పచ్చిమిర్చి లో కీమా మిశ్రమం పెట్టి, కట్ చేసిన పూరీ రిబ్బన్ తో పచ్చిమిర్చిని పూర్తిగా చుట్టాలి.
చివర్లు ఊడిపోకుండా నీటితో తడిపి అంటించాలి.
9) వీటిని అలాగే కాగే నూనెలో వేసి గోధుమ రంగులోకి వచ్చేలా బాగావేయించి ఒక ప్లేటులోకి తీసుకోని టమాటా సాస్ తో సర్వ్ చెయ్యాలి.
అంతే మటన్ కీమా మిర్చి బజ్జి రెడీ.