
కావలసిన పదార్దములు :
ఎండుమిర్చి : పది హేను
ఉప్పు : సరిపడ
చింతపండు : నిమ్మకాయంత
జీలకర్ర : టీ స్పూన్
వెల్లుల్లి రేకలు : పది
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
తయారుచేయు విధానం :
1) నూనె వేడి చేసి ఎండుమిర్చి వేయించాలి. అదే నూనెలో జీలకర్ర వేసి వేయించాలి.
2)వేయించిన ఎండుమిర్చికి ఉప్పు,జీలకర్ర కలిపి నూరిన తర్వాత చింతపండు వేసి నూరాలి. అలాగే ఎండిమిర్చి,చింతపండు నలిగిన తరువాత వెల్లుల్లి కూడా వేసి నూరాలి.
అంతే చింతపండు కారప్పొడి రెడీ (దీనినే నల్లకారం అని కూడా అంటారు.)
ఈ నల్లకారం అప్పటికప్పుడు చేసుకొని వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది.