ఖర్జూరం కుడుములు (Dates Coconut Kudumulu in Telugu )



ఖర్జూరం కుడుములు 

కావలసిన పదార్ధాలు:

బియ్యపు రవ్వ : కప్పు 
పెసరపప్పు: పావు కప్పు 
ఖర్జూరాలు : పదిహేను  
కొబ్బరి తురుము : పావు కప్పు 
నెయ్యి : కొద్దిగా  
యాలకుల పొడి : చిటికెడు 
మంచినీళ్ళు : మూడు కప్పులు 
పాలు : కప్పులు 

తయారు చేసే విధానం:

1) స్టవ్ ఫై నీళ్ళు, పాలు కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి.
2) నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు పెసరపప్పును వేయాలి.
3) పెసరపప్పు కొద్దిగా ఉడికిన తరువాత బియ్యపు రవ్వని పోసి ముద్ద కాకుండా కలుపుతూ ఉండాలి.
4) ఈ మిశ్రమం ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి. 
5) తరువాత ఖర్జూరాన్ని చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
 6) ఖర్జూరంలో కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకోవాలి.
7)తర్వాత దీన్ని చిన్నచిన్న  ముద్దలుగా చుట్టుకోవాలి.
8) ఇప్పుడు ఉడికిన బియ్యపు రవ్వకొద్దిగా చేతిలోకి తీసుకోని 
వెడల్పుగా చేసి దీనిలో కర్జురపు ఉండను పెట్టి గుండ్రంగా చుట్టాలి.
9) ఇప్పుడు వీటిని  ఇడ్లీ కుక్కర్ లో పెట్టి పది  నిమిషాలు ఆవిరి మీద ఉడకనివ్వాలి.
 అంతే రుచిగా ఉండే ఖర్జూరం కుడుములు రేడి.