దోశలు (Red Dal Dosa in Telugu )

కంది దోశ 
కావలసిన పదార్దాలు: 

మినపప్పు : కప్పు 
కందిపప్పు : అర కప్పు 
అటుకులు : అర కప్పు 
బియ్యం : రెండు కప్పులు 
మెంతులు : టేబుల్ స్పూన్ 
రవ్వ : టేబుల్ స్పూన్ 
నూనె : కప్పు 
ఉప్పు : తగినంత 

తయారుచేయు విధానం :

1) ఐదు గంటలముందు పప్పులు, బియ్యం, మెంతులు  విడివిడిగా నానబెట్టాలి. 
2)అటుకులు నీళ్ళల్లో వేసి తియ్యాలి. 
3) తరువాత పప్పులు, బియ్యం, అటుకులు,మెంతులు అన్ని కలిపి మెత్తగా  గ్రైండ్ చెయ్యాలి.
4) ఈ పిండిని ఒక రాత్రంతా పక్కన పెట్టాలి. అలా ఉంచితే దోశ బాగా వస్తుంది.
5) ఉదయం పిండిలో ఉప్పు కలిపి నాన్ స్టిక్ పాన్ ఫై దోశవేసి ఎర్రగా కాల్చాలి. 
6) కావాలంటేఉల్లి, మిర్చి, జీలకర్ర, కొత్తిమీర, అల్లముక్కలు వేసుకొవచ్చు.  
7) వీటిని పల్లిల చెట్నితో కాని, కొబ్బరి చెట్నితో కాని తింటే చాల రుచిగా ఉంటాయి.