బొబ్బర్లు వడలు (bobbarlu vadalu in telugu )

బొబ్బర్ల పప్పు వడలు:


కావలసిన పదార్దాలు :

బొబ్బర్లు -కప్పు
అల్లం -చిన్నముక్క
పచ్చి మిర్చి-మూడు
కరివేపాకు -రెండు రెమ్మలు
ఉప్పు-తగినంత
నూనె -వేయించటానికి సరిపడ.


తయారు చేయు విధానం  :


1) బొబ్బర్లు రాత్రంతా నానబెట్టి ఉదయం గట్టిగా రుబ్బాలి.
2) దీనికి అల్లం,పచ్చిమిర్చి,కరివేపాకు ,ఉప్పు కలపాలి.
3) ఇప్పుడు నూనె వేడి చేసి కలిపిన పిండిని  వడలుగా చేసి కాగె నూనెలో దోరగా వేయించాలి.