బీట్‌రూట్ కూర(Beetroot Curry in Telugu )



బీట్‌రూట్ కూర  

కావలసిన పదార్ధాలు:

బీట్‌రూట్‌ : పావు కేజీ 
పెసరపప్పు : రెండు స్పూన్లు 
పచ్చికొబ్బరి : ఒక చిప్ప 
పచ్చిమిర్చి : ఏడు  
ఉప్పు :  సరిపడ 
పసుపు: కొద్దిగ 
పోపు గింజలు : రెండు స్పూన్లు 
నూనె : ఐదు స్పూన్లు 


 తయారు చేయు  విధానం:

1) పెసర పప్పు నానబెట్టాలి. 
2) బీట్‌రూట్‌ పై చెక్కు తీసి నీటిలో బాగా కడిగి తురుముకోవాలి. 
3) కొబ్బరి కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. 
4) స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోసి పోపు గింజలు, కరివేపాకు వేసి వేగాక నానబెట్టిన పెసరపప్పు, తురిమి పెట్టుకున్న బీట్‌రూట్‌ వేసి సన్నని మంట మీద ఉంచి కలుపుతూ ఉండాలి. 
5) ఉడికిన తరువాత పచ్చి మిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, వేసి కలిపి మూత పెట్టి రెండు  నిమిషాలు ఉడికించాలి.
6)  ఇప్పుడు  కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి రెండు  నిమిషాలు కలిపి దింపుకోవాలి.
అంతే రుచి కరమైన బీట్‌రూట్ కూర రేడి