బీరకాయ టమాట పచ్చడి angular gourds love-apple pickle in telugu)

బీరకాయ టమాటో పచ్చడి:
కావలసినపదార్దాలు  :

బీరకాయలు : ఒకటి 
టమాటోలు : రెండి 
పచ్చిమిర్చి: పది 
ఉప్పు: తగినంత 
జీలకర్ర : టీ స్పూన్,
వెల్లుల్లి రెబ్బలు : ఐదు 
చింతపండు : నిమ్మకాయంత
కొత్తిమీర : రెండు రెమ్మలు,
నూనె : మూడు టేబుల్ స్పూన్లు .
తయారు చేయు విధానం :

1) స్టవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడి చేసి పచ్చిమిర్చి వేసి వేయించాలి.అవి వేగాక తీయ్యాలి.
2) బీరకాయ ముక్కలు, టమాటో ముక్కలు నూనె లో వేసి మగ్గించాలి.
3) ముందుగా మిక్సి జార్లో పచ్చిమిర్చి వేసి సరిపడా ఉప్పు,జీలకర్ర ,వెల్లుల్లి చింతపండు వేసి ఒకసారి గ్రైండ్ చెయ్యాలి.
4) తరువాత వేయించిన  బీరకాయ ముక్కలు టమాటోముక్కలు వేసి ఒక్క సారి లైట్ గా గ్రైండ్ చేసి తియ్యాలి.
5) ఈ పచ్చడి ఒక గిన్నెలోకి తీసి పైన కొత్తిమీర జల్లాలి.
కావాలంటే ఈ పచ్చడి పోపు పెట్టుకోవచ్చు. 
అంతే బీరకాయ టమాటో రోటి పచ్చడి రెడీ .