వెజ్ కర్రీ (vegetarian curry in telugu )

కావలసిన పదార్దాలు :

ఆలూ  : రెండు
బీట్‌రూట్‌ : ఒకటి
క్యారెట్‌ : రెండు
పచ్చిబఠాణి : కప్పు
టమోటాలు :రెండు
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : మూడు
కొతిమీర :  కట్ట
కారం :  టీ స్పూన్‌
పసుపు : పావు టీ స్పూన్‌
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : టీ స్పూన్‌
నూనె : మూడు టేబుల్ స్పూన్లు 

ఆవాలు : టీ స్పూన్‌
జీలకర్ర : టీ స్పూన్‌
ఎండుమిర్చి : రెండు 

ఉప్పు : తగినంత

తయారుచేయు విధానం :

1) ఆలూ, క్యారెట్‌, బీట్‌రూట్‌లను చెక్కుతీసి కొద్దిగా సాల్ట్‌ వేసి ఉదికించు కోవాలి. బఠాణి ఉడికించి పక్కన పెట్టండి. 
2) ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటాలను ముక్కలుగా కట్ చెయ్యాలి. 
3) స్టవ్‌ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి.
4) కాగిన నూనెలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకువేగిన తరువాత  ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
5) ఇప్పుడు  టమోటా ముక్కలు వేసి అవి మెత్తబడ్డాక అల్లంవెల్లుల్లి పేస్ట్‌,
కారం, పసుపు, ఉప్పు వేసి ఒక నిముషం వేయించాలి. 
6) ఇప్పుడు ఉడికించిన దుంపలు, బఠాణిలు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి చిన్న మంటమీద ఉడకనివ్వాలి.
7) దగ్గరగా ఉడికిన తరువాత, కొత్తిమీర, మషాలా వేసి దించేయాలి.