మొక్కజొన్న బోండాలు (Sweet Corn Bajji in telugu Mokkajonna Bondalu)

కావలసిన పదార్థాలు
ఉడికించిన  మొక్కజొన్న గింజలు - ఒక కప్పు
ఉడికించిన  బంగాళదుంప ముద్ద - 1 కప్పు
పచ్చిమిర్చి - రెండు 
అల్లం - చిన్నముక్క,
కొత్తిమీర - ఒక కట్ట
జీలకర్ర - చిటికెడు
ఉప్పు - తగినంత
శనగపిండి - రెండు కప్పులు
నూనె - వేయించడానికి సరిపడా

తయారుచేయు విధానం 


 1) ఒక గిన్నెలో శనగపిండి  ఉప్పు వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి.2) అల్లం, పచ్చిమిర్చి, ఉడకబెట్టిన మొక్కజొన్న గింజలు మిక్సీ వేసుకోవాలి. 
3) ఈ మిశ్రమంలో ఆలుగడ్డ ముద్ద, సన్నగా తరిగిన కొత్తిమీర, జీలకర్ర వేసి కలుపుకోవాలి. 
4) దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. 
5) వీటిని ముందుగా కలిపిపెట్టుకున్న శనగపిండిలో ముంచి కాగిన నూనెలో వేయించుకోవాలి