దోసకాయ - ఒకటి
ఉల్లిపాయ- ఒకటి
పచ్చిమిర్చి - నాలుగు
ఎండిమిర్చి - రెండు
పోపుదినుసులు - స్పూన్
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
కారం - అర టీ స్పూన్
ఉప్పు - సరిపడ
పసుపు - చిటికెడు
కరివేపాకు - రెండు రెమ్మలు
తయారుచేయు విధానం
1) దోసకాయను చెక్కి ముక్కలుగా చెయ్యాలి.ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు చెయ్యాలి.
2) స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేడి చేసి పోపుదినుసులు,ఎండిమిర్చి,కరివేపాకు వేసి వేగనివ్వాలి.
3) అవి వేగాక ఉల్లి,మిర్చి ముక్కలు వేసి వేగనిచ్చి దోస ముక్కలు వేసి రెండు నిముషాలు మగ్గనివ్వాలి.
4) ఇప్పుడు కారం,ఉప్పు,పసుపు వేసి కలిపి చిన్న గ్లాస్ నీళ్ళు పోసి పది నిముషాలు వుడకనిస్తే కూర రెడీ.
4) స్టవ్ ఆపి కొత్తిమీర చల్లాలి.వేసవిలో ఈకూర చాలా మంచిది.చలువ చేస్తుంది.

Post a Comment