కావలసిన పదార్దాలు:
సగ్గు బియ్యం : రెండుకప్పులు
ఉప్పు : సరిపడా
జీలకర్ర : పావుకప్పు
నీళ్ళు : పన్నెండు కప్పులు
పచ్చిమిర్చి పేస్టు : పావుకప్పు
తయారు చేయు విధానం:
1) పది కప్పుల నీళ్ళు స్టవ్ మీద పెట్టి మరగ నివ్వాలి. దీనిలో జీలకర్ర,ఉప్పు,పచ్చిమిర్చి పేస్టు వేయాలి.
2) నాలుగు కప్పుల నీళ్ళతో సగ్గు బియ్యం నానబెట్టాలి. ఇప్పుడు మరుగు తున్ననీటిలో వేసి వుడకనివ్వాలి.
3)ఉడికి చిక్కబడిన తరువాత స్టవ్ ఆపాలి. దీనిని కొద్దిగా చల్లారనిచ్చి ఒకప్లాస్టిక్ కవరు మీద లేదా క్లాత్ మీద గరిటతో కొద్ది,కొద్దిగా వడియాలుగా వేసి ఎండలో బాగా ఆరనిచ్చి తీసి డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
ఇవి నూనెలో వేపుకోవాలి..