రాజ్మా హల్వా (Razma Halwa in Telugu)

కావలసిన పదార్దాలు

రాజ్మా : కప్పు
పాలు : కప్పు నెయ్యి : కప్పు
పంచదార : కప్పు
యాలకులపొడి : టీ స్పూన్
కోవా : అరకప్పు
జీడిపప్పులు, బాదాం పప్పులు : పావు కప్పు

తయారుచేయు విధానం :

1) రాజ్మాని రాత్రంతా నానబెట్టి ఉదయం మెత్తగా రుబ్బాలి.
2) స్టవ్ ఫై కళాయి పెట్టి నెయ్యి వేడి చేసి రాజ్మా ముద్దను నేతిలో వేయించాలి.
3) తరువాత పాలుపోసి దగ్గరగా ఉడికించాలి.ఇప్పుడు పంచదార వేసి కరిగిన తరువాత కోవా వేసి కలుపుతూ ఉంటె హల్వా రెడీ అవ్వుతుంది.
4)ఇప్పుడు యాలకులపొడి, జీడిపప్పు,బాదాం పప్పును చిన్నచిన్న ముక్కలుగా చేసి హల్వాలో కలిపి స్టవ్ ఆపాలి.