పెసర బూరెలుకావలసిన పదార్దాలు :
పెసరపప్పు : ఒక కప్పు
పచ్చికొబ్బరి తురుము : అర కప్పు
పంచదార : ఒకకప్పు
మైదా : రెండు కప్పులు
నూనె : వేయించటానికి సరిపడ
యాలకులు పొడి : టీ స్పూన్
తయారుచేయు విధానం:
1) పెసర పప్పును రెండు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బాలి.
2) దీనిని ఇడ్లి రేకుల ఫై వేసి ఆవిరి మీద ఇడ్లీలా ఉడికించాలి.
3) ఉడికిన తరువాత వీటిని చేతితో పొడిలా చేసి దీనిలో కొబ్బరితురుము, పంచదార, యాలకుల పొడి వేసి కలిపితే గట్టిగా తయారవుతుంది.
4) దీనిని చిన్నచిన్న ఉండలుగా చేసు కోవాలి.
5) మైదా లో చిటికెడు ఉప్పు, రెండు టేబుల్ స్పూన్లు పంచదార వేసి నీళ్ళు పోసి బజ్జి పిండిలా జారుగా కలుపుకోవాలి.
6) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనే వేడి చేసి పెసర ఉండను మైదాలో ముంచి కాగె నూనెలో వేసి దోరగా వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
7) మైదా ఇష్టం లేనివాళ్ళు దోసెల పిండిలోముంచి వేసు కోవచ్చు.