పరోటా (parathe in telugu)

మిక్సడ్ పరోట  
కావలసిన పదార్దాలు :

గోధుమ పిండి : ఒక కప్పు 
చీజ్ : టేబుల్ స్పూన్(వెన్న) 
ఉల్లి ముక్కలు : రెండు టేబుల్ స్పూన్లు 
టమాట ముక్కలు : రెండు టేబుల్ స్పూన్లు 
కొత్తిమీర తురుము : టేబుల్ స్పూన్ 
పచ్చిమిర్చి పేస్టు:టీ స్పూన్ 

తయారుచేయువిధానం: 

1) గోధుమ పిండి లో ఉప్పు వేసి కలిపి నీళ్ళు పోసి చేపాతి ముద్దలా కలిపి అర గంట పక్కన పెట్టాలి. 
2) ఇప్పుడు రెండు చెపాతిలు చేసుకోని రెండింటికి ఒక ప్రక్క  చీజ్ రాసుకోవాలి.
3) ఒక చెపాతి ఫై పచ్చిమిర్చి పేస్టు రాసి దాని ఫై ఉల్లి ముక్కలు, టమాట ముక్కలు కొత్తిమీర  వేసి వాటిఫై చీజ్ రాసిన  రెండో చేపాతితో కప్పాలి. .
4) స్టవ్ వెలిగించి నాన్ స్ట్ క్  పాన్ వేడి చేసి ఈ ఉల్లి మిశ్రమం ఉన్న పరోటాను వేసి చుట్టూ కొంచెం నూనె వేసి రెండు  ప్రక్కలా  కాల్చాలి.
5) రెడీ అయిన పరోటా ను ఒక ప్లేటులోకి తీసుకుని త్రికోణం ముక్కలుగాకట్ చేసి టమాటసాస్ తో సర్వ్ చెయ్యాలి.