చికెన్ సూప్ (Chicken Soup in Telugu)

కావలసిన పదార్దాలు :

మెత్తని చికెన్ : పావు కిలో
పాలకూర తరుగు : ఒక కప్పు
క్యారెట్ ముక్కలు : పావుకప్పు
బీన్స్ ముక్కలు : పావుకప్పు
కార్న్ ఫ్లోర్ :: టీ స్పూన్
వెల్లుల్లి ముక్కలు : టీ స్పూన్
పచ్చిమిర్చి ,ముక్కలు : టీ స్పూన్
 మిరియాల పొడి : చిటికెడు
ఉప్పు : తగినంత
నూనె : టీ స్పూన్
పంచదార : టీ స్పూన్
అజినమోటో : చిటికెడు
ఉల్లి కాడలముక్కలు : టీ స్పూన్

తయారుచేయు విధానం :

1) స్టవ్ మీద గిన్నె పెట్టి చికెన్ వేసి అది మునిగే వరకు నీళ్ళు పోసి ఉడికించి పక్కనపెట్టాలి.
2) తరువాత స్టవ్ ఫై పాన్ పెట్టి నూనె వేడి చేసి క్యారెట్ ముక్కలు, బీన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చివేసి వేయించాలి .
3) వేగాక చికెన్ ఉడికించిన నీళ్ళు, పంచదార, ఉప్పు, పాలకూర తరుగు, ఉల్లి కాడల తరుగు,
మిరియాలపొడి వేసి పది నిముషాలు ఉడికించాలి.
4) ఇప్పుడు కార్న్ ఫ్లోర్ నీటిలో కలిపి ఉడుకుతున్న సూప్ లో వేసి కలిపి స్టవ్ ఆపాలి.
5) సర్వ్ చేసే ముందు అజినమోటో వేసి సర్వ్ చెయ్యాలి.