పనీర్ బిర్యాని కావలసిన పదార్దాలు :
పనీర్ ముక్కలు : కప్పు
బాస్మతి బియ్యం : రెండు కప్పులు
పచ్చి బఠాని : అర కప్పు
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టు : టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
కొత్తిమీర తురుము : కప్పు
యాలుకులు : రెండు
లవంగాలు : నాలుగు
దాల్చిన చెక్క : చిన్నది
జీలకర్ర : టీ స్పూన్
పలావ్ ఆకు లు : రెండు
జీడిపప్పులు : ఆరు
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు
నూనె : మూడు టేబుల్ స్పూన్లు
తయారు చేయు విధానం:
1) బియ్యం కడిగి పది నిముషాలు నానబెట్టాలి.జీడిపప్పులు వేయించాలి.
2) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చెసి పనీర్ ముక్కలు వేయించి ఒక ప్లేటులోకి తీసి పక్కన పెట్టాలి.
౨) ఇదే పాన్ లో నూనె వేసి యాలుకులు, లవంగాలు, చెక్క, పలావ్ ఆకు, జీలకర్ర వేసి వేయించాలి.
౩) అవి వేగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిబఠాని వేసి వేయించాలి.
౬) ఇప్పుడు బియ్యం వేసి ఐదు నిముషాలు వేయించి ఉప్పు వేసి మూడున్నర కప్పుల నీళ్ళు పోసి ఉడికించాలి.
౬) ఉడికిన తరువాత జీడిపప్పులు, కొత్తిమీర, పనీర్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి స్టవ్ ఆపాలి.
Post a Comment