కోర్రబియ్యం పాయసం (korrabiyyam payasam )

కొర్ర బియ్యం పాయసం 

కావలసిన పదార్దాలు :

కొర్ర బియ్యం : కప్పు 
పాలు : మూడు కప్పులు 
షుగర్ : కప్పు 
యాలుకులు పొడి : టీ స్పూన్ 
జీడిపప్పులు : పది 
నీళ్ళు : కప్పు 
నెయ్యి : టేబుల్ స్పూన్ 

తయారుచేయు విధానం: 

1) స్టవ్ వెలిగించి పాలు నీళ్ళు కలిపి వేడిచేయ్యాలి. పాలు మరుగుతుండగా  కోర్రబియ్యం వేసి ఉడికించాలి.
2) పక్క స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేడిచేసి జీడి పప్పులు దోరగా వేయించాలి.
3) ఇప్పుడు పాయసం ఉడికిన తరువాత స్టవ్ ఆపి షుగర్, యాలుకులుపొడి, వేయించిన జీడిపప్పులు వేసి కలపాలి.
అంతే వేడివేడి కొర్ర పాయసం రెడీ.వేడి వేడిగా  సర్వ్ చెయ్యాలి.