పాలకూర చపాతి (palakoora chapaati in telugu )


కావలసిన పదార్దాలు 

గోధుమ పిండి : ఐదు కప్పులు  
పాలకూర తురుము : కప్పు 
కొత్తిమీర తురుము : అర కప్పు 
ఉప్పు : తగినంత 
పచ్చిమిర్చి పేస్టు : టీ స్పూన్ 
వెన్న : టేబుల్ స్పూన్ 
నూనె : కప్పు 

తయారుచేయు విధానం 

1) కొత్తిమీర, పాలకూర చిన్నగా తురమాలి.  దీనిలో గోధుమ పిండి,ఉప్పు, వెన్న,పచ్చిమిర్చి పేస్టు వేసి కొద్దిగా నీళ్ళు వేసి చపాతి పిండిలా కలిపి ఒక గంట పక్కన పెట్టాలి.
2)తరువాత చపాతీలుగా చేసి స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి చపాతి కాల్చాలి. .ఇవి వేడివేడిగా తింటే చాల బాగుంటాయి.