దోసకాయ జ్యుస్కావలసిన పదార్దాలు :
దోసకాయ : ఒకటి
ఉప్పు : తగినంత
నిమ్మరసం : టీ స్పూన్
పుదినా ఆకులు : కొద్దిగా
ఐస్ క్యూబ్స్ : మూడు
తయారుచేయు విధానం :
1) దోసకాయను చెక్కి ముక్కలుగా చెయ్యాలి.దీనిలో గింజలు తీసేయ్యాలి.
2) మిక్సి జార్లో దోసకాయ ముక్కలు, ఉప్పు, పుదినా ఆకులు వేసి గ్రైండ్ చెయ్యాలి.
3) దోస ముక్కలు మెత్తగా అయ్యాక గ్లాసు నీళ్ళు పోసి మళ్ళి గ్రైండ్ చెయ్యాలి. దీనిని గ్లాసులోకి వడకట్టి నిమ్మరసం
కలిపి ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చెయ్యాలి.