రవ్వతో హాట్ బొబ్బట్లు (Ravva bobbatlu in telugu )


కావలసిన పదార్దాలు :

మైదా : పావుకేజీ 
రవ్వ : పావుకేజీ 
నెయ్యి : టేబుల్ స్పూన్ 
కారం : అర టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
ఉల్లిముక్కలు : పావుకప్పు 
కొత్తిమీర : కొద్దిగా 
టమాటా ముక్కలు : పావుకప్పు 
నూనె : కప్పు 

తయారుచేయు విధానం: 

1) స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళు మరిగించాలి.
2) మరుగుతున్న నీళ్ళల్లో ఉప్పు, కారం, జీలకర్ర వేసి రవ్వ పోస్తూకలపాలి.
3) ఇది గట్టి పడుతుండగా స్టవ్ ఆపి,ఉల్లిముక్కలు, కొత్తిమీర, టమాట ముక్కలు వేసి కలిపి మూత పెట్టి కాసేపు పక్కన పెట్టాలి.
4) ఇప్పుడు మైదాలో కరిగించిన నెయ్యి వేసి కలిపి నీళ్ళు పోసి ముద్దలా కలపాలి.
5) రవ్వ మిశ్రమం చల్లారిన తరువాత ఉండలుగా చేసుకోవాలి.
6) మైదా ముద్దలో కొంచెం తీసుకోని చేతితో వెడల్పుగా చేసి దాని మద్యలో రవ్వ ఉండపెట్టి మళ్ళి ఉండాలా చుట్టాలి. 
7) ఇలా చేసిన మైదా ఉండను చపాతిగా చేసి స్టవ్ మీద పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి చపాతి లా  రెండు ప్రక్కలా నూనె వేస్తూ  కాల్చాలి.