కొబ్బరి పాయసం (Coconut Payasam in Telugu)


కావలసిన పదార్దాలు :

పాలు : అరలీటరు
కొబ్బరిపాలు చిక్కనివి : అరకప్పు
పంచదార : అరకప్పు
నువ్వులు, మినపప్పు, పెసరపప్పు, జీడిపప్పు : ఒకొక్క టేబుల్ స్పూన్
యాలకులు పొడి : టీ స్పూన్
నేతిలో వేయించిన జీడిపప్పు,కిస్మిస్లు : రెండు టేబుల్ స్పూన్లు

తయారుచేయు విధానం :

1) స్టవ్ మీద కళాయి పెట్టి మినపప్పు, పెసర పప్పు, నువ్వులు, జీడిపప్పు విడివిడిగా వేయించి పొడి చేసి పక్కనపెట్టాలి.
2) ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టి మరిగించాలి. 
3) పాలు మరుగుతుండగా కొబ్బరిపాలు వేసి ఒకనిముషం మరిగించాలి.
4) చిన్న మంట చేసి పాలల్లో పంచదార వేసి కలపాలి. విడిగా కొన్ని పాలు తీసుకోని దానిలో పొడి చెసిన పప్పుల మిశ్రమం కలిపి మరుగుతున్న పాలల్లో వేసి ఐదు నిముషాలు మరిగించాలి.
5) దించే ముందు  యాలకులపొడి, వేయించిన జీడిపప్పు కిస్మిస్లు వేసి స్టవ్ ఆపాలి. అంతే కొబ్బరి పాయసం రెడీ.