కావలసిన పదార్దాలు :
వేయించిన అటుకులు : కప్పు
బూంది : అర కప్పు
కారప్పూస : అర కప్పు
క్యారెట్ తురుము : అర కప్పు
టమాటా ముక్కలు : అర కప్పు
క్యాప్సికం ముక్కలు : అర కప్పు
నూనెలో వేయించిన పల్లీలు : అరకప్పు
వేయించిన జీడిపప్పు : అర కప్పు
ఉప్పు : తగినంత
గరం మసాలా : టేబుల్ స్పూన్
మామిడి ముక్కలు : అర కప్పు
మామిడి, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి చేసిన పేస్టు : టేబుల్
స్పూన్
మొక్కజొన్న చిప్స్ : అర కప్పు
తయారుచేయు విధానం :
1) ఒక గిన్నె తీసుకోని దానిలో అటుకులు, కారప్పూస, బూంది, క్యారేట్ తురుము, క్యాప్సికం ముక్కలు, టమాటా ముక్కలు, పల్లీలు, జీడిపప్పు, మామిడి ముక్కలు, ఉప్పు, గరం మసాలా, మామిడి పచ్చిమిర్చి పేస్టు, మొక్కజొన్న చిప్సు వేసి బాగా కలపాలి.
మొత్తం కలిసిన తరువాత సర్వ్ చెయ్యటమే.
ఎంతో రుచిగా ఉండే మామిడి మిక్సర్ రెడీ.