పుట్టగొడుగుల సూప్ (Mushrooms Soup Preparation in Telugu)


కావలసిన పదార్దాలు :

పుట్టగొడుగులు : పది
ఉప్పు :తగినంత
నీళ్ళు : ఐదు కప్పులు
ఉల్లి ముక్కలు : టేబుల్ స్పూన్
బీన్స్ ముక్కలు : టేబుల్ స్పూన్
క్యారెట్ : ఒకటి
క్యాబేజి ఆకులు : రెండు
వెల్లుల్లి : ఒకటి
కొత్తిమీర తరుగు : అర కప్పు
కార్న్ ఫ్లోర్ : మూడు టీ స్పూన్లు
నిమ్మరసం : నాలుగు టీ స్పూన్లు పంచదార : టీ స్పూన్

తయారుచేయు విధానం :

1) ఒక కప్పులోకి కొద్దిగా నీళ్ళు తీసుకోని దీనిలో కార్న్ ఫ్లోర్ వేసి
ఉండలులేకుండా కలిపిపక్కన పెట్టాలి.
2) స్టవ్ మీద గిన్నేపెట్టి ఐదు కప్పుల  నీళ్ళు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి.
3) మరుగు తున్న నీటిలో బీన్స్, క్యారెట్, పుట్టగొడుగులు, ఉల్లిముక్కలు,
వెల్లుల్లి, క్యాబేజి ఆకులు వేసి ఉడికించాలి.
4) ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పంచదార వేసి కాసేపు మరగనివ్వాలి.
5) నీటిలో కలిపిన మొక్కజొన్న పిండి వేసి రెండు నిముషాలు మరిగించి స్టవ్ ఆపాలి.
6) ఇప్పుడు నిమ్మరసం కలిపి మిగిలిన కొత్తిమీర వేసి మూత పెట్టాలి.
అంతే మష్రూం సూప్ రెడీ.