కంద పచ్చడి (kanda pickle in telugu)


కావలసిన పదార్దాలు: 

కంద : పావుకేజీ 
పచ్చిమిర్చి : పదహారు 
ఎండు మిర్చి : ఆరు 
చింతకాయలు : పెద్దవి ఐదు (లేదా చింతపండు గుజ్జు )
కొబ్బరి పొడి  : రెండుటేబుల్ స్పూన్లు  
పోపుదినుసులు : రెండు  టీ స్పూన్లు 
బెల్లం తురుము  : రెండు టీ స్పూన్లు 
నూనె : అరకప్పు 
పెరుగు :అర కప్పు 
పసుపు : పావు టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
కొత్తిమీర : కట్ట 
ఇంగువ : చిటికెడు  
జీలకర్ర : టీ స్పూన్ 
శెనగ పప్పు : టీ స్పూన్ 

తయారుచేయు విధానం :


1) కందను చెక్కి ముక్కలుగా కట్ చెయ్యాలి. వీటిని పెరుగులో వేసి పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కాసేపు ఆగి పెరుగు పిండి కంద ముక్కలు ఒకప్లేటులోకి తీసుకోవాలి.
2) చింతకాయలు కడిగి దంచుకొని గింజలు, కాడలు తీసి పక్కన పెట్టుకోవాలి.
3) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక జీలకర్ర, శెనగ పప్పు,పచ్చిమిర్చి, కొత్తిమీర 
వేసి వేయించాలి.
4)  వీటిని ఒక ప్లేటులోకి తీసుకోని ఇదే కళాయి లో కాస్త నూనె వేసి పెరుగులోనుండి తీసిన కంద ముక్కలు,
దంచి గింజలు తీసిన చింత కాయల మిశ్రమం వేసి కాసేపు మగ్గనివ్వాలి. 
5) ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చి మిశ్రమం, కంద, చింతకాయల మిశ్రమం, ఉప్పు మిక్సి జార్లో వేసి మిక్సి  పట్టాలి. దీనికి కొబ్బరి పొడి, బెల్లం తురుము వేసి కలిపితే పచ్చడి రెడీ .
6) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు, ఎండు మిర్చి,వెల్లుల్లి, మెంతులు, కరివేపాకు వేసి 
వేగిన తరువాత ఈ పోపు పచ్చిడిలో వేసి కలపాలి. 
అంతే కంద పచ్చడి రెడీ.