ఇడ్లీ భర్గర్ (idly burger)

ఇడ్లి బర్గర్ 
కావలసిన పదార్దాలు: 

పెద్ద ఇడ్లీ : ఒకటి  
ఉడికించిన ఆలూ : అరకప్పు 
ఉడికించిన క్యారెట్ : అర కప్పు 
ఉడికించిన బఠాని : పావు కప్పు 
ఉడికించిన స్వీట్ కార్న్ : పావుకప్పు 
జీలకర్ర : అర టీ స్పూన్ 
గరం మసాలా : పావు టీ స్పూన్ 
కొత్తిమీర తురుము : టేబుల్ స్పూన్ 
టమాటా సాస్ : టీ స్పూన్ 
చిల్లి సాస్ : టీ స్పూన్ 
గుండ్రంగా కట్ చేసిన ఉల్లి ముక్కలు : మూడు 
గుండ్రంగా కట్ చేసిన టమాటా ముక్కలు : మూడు 
బ్రెడ్ పొడి : రెండు టీ స్పూన్లు 

తయారు చేయు విధానం :

1) ఉడికించిన బఠాని, స్వీట్ కార్న్ విడివిడిగా మిక్సి పట్టాలి. 
2) ఇడ్లిని  బ్రెడ్ స్లైస్ లా మధ్యకు కట్ చెసి పక్కన పెట్టాలి.
3) ఇప్పుడు ఒక గిన్నెలోకి ఉడికించిన ఆలూ, క్యారెట్, మిక్సి వేసిన బఠానిముద్ద స్వీట్ కార్న్ ముద్ద,  జీలకర్ర , ఉప్పు, గరం మసాలా, కారం, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
4) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి వెడేక్కిన తరువాత ఒక స్పూన్ బ్రెడ్ పొడి వేసి కళాయి లో వెడల్పుగా చేసి దానిమీద ఆలూ మిశ్రమం ముద్దను గుండ్రంగా చేసి కళాయిలో వేసి దాని ఫైన మిగిలిన బ్రెడ్ పొడి వేసి చిన్న మంట మీద 
రెండు నిముషాలు కాలనిచ్చి రెండో ప్రక్క తిప్పి ఒకనిముషం ఉంచి స్టవ్ ఆపాలి. 
5) ఇప్పుడు ఇడ్లి ముక్కలు తీసుకోని రెండు  ముక్కల మీద టమాటా సాస్ రాయాలి.
6) ఒక దాని ఫై వేడి చేసిన ఆలూ ముద్దమిశ్రమం  పెట్టి దాని ఫై టమాటా ముక్కలు పెట్టి వాటి మీద ఉల్లి ముక్కలు పెట్టాలి.
7) వీటి ఫై చిల్లి సాస్ వేసి దానిఫై కొత్తిమీర జల్లి మిగిలిన ఇడ్లి ముక్కను దీని మీద పెట్టాలి. 
అంతే ఇడ్లి బర్ఘర్ రెడీ