పల్లిల చెక్కలు (Ground Nuts Sweet Plates palli chekkalu)

కావలసిన పదార్దాలు : 

బియ్యప్పిండి : కప్పు 
ఉప్పు : తగినంత 
కారం : అర టీ స్పూన్ 
వాము : టీ స్పూన్ 
నువ్వులు : టీ స్పూన్ 
వేయించిన పల్లిలపప్పు : అర కప్పు 
నూనె : వేయించటానికి సరిపడా 

తయారుచేయు విధానం :

 1) బియ్యప్పిండిలో కారం, ఉప్పు, వాము, నువ్వులు పల్లిలపప్పు వేసి కలిపి నీళ్ళు పోసి గట్టిగా ముద్దలా  కలపాలి.
2) దీనిని చేతితో ఒక క్లాత్ మీద చెక్కలుగా గుండ్రంగా వత్తాలి.(పూరిలప్రెస్ మీద నొక్కినా గుండ్రంగా వస్తాయి.) 
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. 
4) నూనె కాగిన తరువాత చేసి ఉంచిన చెక్కలు  వేసి రెండు ప్రక్కలా దోరగా వేయించి తీసుకోవాలి.

అంతే కరకరలాడేపల్లిల చెక్కలు  రెడీ.