దమ్‌కా బిర్యాని (Dham ka Biryani Preparation in Telugu)

Published by Ratnakumari Muvvala on  | 4 comments

కావలసిన పదార్థాలు :
చికెన్‌ - ఒక కిలో
బాస్మతి బియ్యం - ఒక కిలో
గరం మసాల - రెండు టీ స్పూన్లు
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను
పెరుగు - ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
పచ్చి మిరపకాయలు - ఐదు
ఎండు మిరపకాయలు - ఆరు
పసుపు - చిటికెడు
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
తయారుచేయు  విధానం :
ముందుగా మాసాన్ని శుభ్రంగా కడిగి కొద్ది గా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి నీళ్ళు వంచుకోవాలి. 
ఐదు నిమిషాల తర్వాత  నీళ్లు పోసి స్టవ్  మీద బియ్యం  సగం మాత్రమే ఉడికించాలి. 
ఇప్పుడు స్టవ్  మీద మరో మందపాటి గిన్నె  ఉంచి సరిపడా నూనె వేసి పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. 
ఇప్పుడు పెరు గులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా దీనిలో  వేసి దానిపై ఉడికించిన అన్నాన్ని వేయా లి. 
ఇలాగే ఇంకో పొరలా మిగలిన మాంసాన్ని మళ్ళి  అన్నాన్ని వేసి మూత పెట్టాలి. 
పాత్ర నుంచి ఆవిరి బయ టకు పోకుండా ఉండటానికి మెత్తగా కలిపిన మైదాను మూత అంచుల చుట్టూ పెట్టాలి. 
మైదా పిండి మొత్తం ఆవిరైపోయి పెచ్చులుగా వచ్చే వరకూ ఉడికించి దించేయాలి. 
చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయలను వేసి అలంకరించు కోవాలి. దీనికి గోంగూరకూరను  వేసి సర్వ్‌ చేసుకోవచ్చు.

About the Author

This Recipe is Prepared and Written by Ratnakumari Muvvala. For video recipes please subscribe my channel at Maa Vantagadi

4 comments:

  1. Good tips for cooking every one I love it

    ReplyDelete
  2. Good tips for cooking every one I love it

    ReplyDelete

    Receive our Recipes via email, just enter your email address and click subscribe.

Blogger template. Proudly Powered by Blogger.
back to top