
కారకాయ స్టఫింగ్
కావలసిన పదార్దాలు:
కాకరకాయలు : మూడు
దనియాలు : టేబుల్ స్పూన్
మినపప్పు : టేబుల్ స్పూన్
ఎండు కొబ్బరి తురుము : రెండు టేబుల్ స్పూన్లు
పల్లీలు : టేబుల్ స్పూన్
ఎండు మిర్చి : ఐదు
ఉప్పు : తగినంత
నూనె : వేయించటానికి సరిపడా
వెల్లుల్లి : మూడు రెబ్బలు
తయారు చేయు విధానం:
1) కాకర కాయలు ఒకప్రక్క నిలువుగా చీల్చిగింజలు తీసి పక్కన
పెట్టాలి.
2) స్టవ్ ఫై నూనె పెట్టి కాకరకాయలు నూనెలో మునిగేలా వేసి వేయించి
పక్కన పెట్టాలి.
3) వేరే కళాయి లో కొద్దిగా నూనె వేసి దనియాలు, జీలకర్ర, పల్లీలు,
మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిశెనగపప్పు, వెల్లుల్లి వేసి వేయించాలి.
4) వీటిలో ఎండుకొబ్బరి తురుము, ఉప్పు వేసి వీటన్నిటిని మిక్సిలో
వేసి మెత్తగా పొడి చెయ్యాలి.
5) ఇప్పుడు ఈ పొడిని వేయించిన కాకరకాయాల్లో పెట్టి (కూరి)స్టఫ్
చెయ్యాలి.
6) ఇప్పుడు స్టవ్ మీద కొద్దిగా నూనె వేసి స్టఫ్ చేసిన కాకరకాయలు
వేసి కాసేపు వేయించాలి.
7) స్టఫ్ చెయ్యగా పొడి మిగిలితే వేగుతున్న కాకర కాయల ఫైన చల్లాలి.
ఒక నిముషం ఆగి స్టవ్ ఆపాలి.
అంతే కాకరకాయల స్టఫ్డ్ కర్రీ రెడీ
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te