కాకరకాయ పచ్చడి (Bitter Gourd Pickle Kakarakaya Pachhadi in Telugu)


కావలసిన పదార్దాలు :

కాకరకాయలు : రెండు
చింతపండు : నిమ్మకాయంత
ఉప్పు : తగినంత
నూనె : కప్పు
మినపప్పు,శెనగపప్పు, నువ్వులు, దనియాలు, జీలకర్ర :
 ఒకొక్క టేబుల్ స్పూన్
పోపుదినుసులు : టేబుల్ స్పూన్
ఎండు మిర్చి : ఏడు
కరివేపాకు : రెండు రెమ్మలు
వెల్లుల్లి : ఐదు రేకలు
ఇంగువ : చిటికెడు

తయారుచేయు విధానం :

1) చింతపండు గుజ్జుతీసి కొద్దిగా విడిగా తీసి మిగిలిన గుజ్జును ఉడికించాలి.
2) కాకరకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి విడిగా తీసిన చింతపండు గుజ్జులో వేసి కొద్దిగా నీళ్ళు వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి.
వీటిని చల్లారిన తరువాత గట్టిగా పిండి నూనె వేడి చేసి బాగా వేయించాలి.
3) స్టవ్ ఫై వేరే కళాయిపెట్టి కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి , మినపప్పు, శెనగ పప్పు, నువ్వులు, జీలకర్ర వేసి వేయించాలి.
4) ఇప్పుడు మిక్సి జార్లో వేయించిన మిశ్రమం వేసి మెత్తగా గ్రైడ్ చేసి దీనిలో వేయించిన కాకరకాయ ముక్కలు ఉప్పు చింతపండు గుజ్జు వేసి మరోసారి గ్రైడ్ చెయ్యాలి.
5) ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనెవేసి పోపుదినుసులు, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ఇంగువ వేసి వేగిన తరువాత ఈ పచ్చడి వేసి తాలింపు వేసు కోవాలి.     
6) అంతే కాకరకాయ పచ్చడి రెడీ.ఇది షుగర్ ఉన్నవాళ్ళకు చాలా మంచిది.