పాప్ కార్న్ లడ్డు కావలసిన పదార్దాలు :
పాప్ కార్న్ : కప్పు
గోధుమలు : అర కప్పు
షుగర్ : కప్పు (లేదా బెల్లం తురుము )
యలుకులు పొడి : టీ స్పూన్
జీడిపప్పు : పావుకప్పు
నెయ్యి : పావుకప్పు
తయారుచేయు విధానం :
1) పాప్ కార్న్ వేయించాలి.అలాగే గోధుమలు కూడా దోరగా వేయించాలి.
2) వేయించిన పాప్ కార్న్ర్, గోధుమలు మిక్సిలో వేసి పొడి చెయ్యండి.
3) ఇప్పుడు ఒక పళ్ళెంలో పాప్ కార్న్, గోధుమల మిశ్రమం, షుగర్ పొడి.కరిగించిన నెయ్యి, యాలుకులు పొడి వేసి
బాగా కలిపి లాడ్డులా చుట్టాలి.వీటి మీద జీడిపప్పులు గుచ్చి సర్వ్ చెయ్యాలి.