వాక్కయాల ఫ్రైడ్రైస్ (Vaakkayala Fried Rice in Telugu)


కావలసిన పదార్దాలు: 

పోడి పోడిగావండిన అన్నం : మూడు కప్పులు 

గింజలు తీసిన వాక్కాయ తురుము : కప్పు 
కొబ్బరి తురుము : కప్పు 
మొలకెత్తిన పెసలు : కప్పు 
పచ్చిమిర్చి పేస్టు : టేబుల్ స్పూన్
క్యారెట్ తురుము :అర కప్పు 
క్యేప్సికం ముక్కలు :అర కప్పు 
నువ్వులు : రెండు టేబుల్ స్పూన్లు 
మినపప్పు : రెండు టేబుల్ స్పూన్లు 
పసుపు : టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
కొత్తిమీర తురుము : టేబుల్ స్పూన్ 
నిమ్మరసం : టేబుల్ స్పూన్ 

తాలింపు కోసం : 


జీడిపప్పు : పది 

ఆవాలు : టేబుల్ స్పూన్ 
శెనగ పప్పు : టేబుల్ స్పూన్ 
పల్లిల్లు :రెండు టేబుల్ స్పూన్లు 
ఎండు మిర్చి : మూడు 
నూనె : అర కప్పు  
కరివేపాకు : రెండు రెమ్మలు 
జీలకర్ర : టీ స్పూన్ 
మినపప్పు : టీ స్పూన్ 

తయారుచేయు విధానం :


1) మొలకెత్తిన పెసలు ఉడికించాలి.మినపప్పు, నువ్వులు వేయించి పొడి చేసుకోవాలి. 

2) పొడిగా వండిన అన్నంలో పచ్చిమిర్చి పేస్టు,పసుపు, ఉప్పు, కొబ్బరి తురుము, వాక్కాయ తురుము, పొడి చేసిన నువ్వుల పొడి వేసి కలపాలి.
3) ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేసి  శెనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు,జీలకర్ర, జీడిపప్పులు  వేసి వేయించాలి. 
4) తరువాత క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము,ఉడికించిన పెసలు వేసి కాసేపు వేయించాలి.
5) దీనిని పసుపు, నువ్వులపొడి కలిపిన అన్నంలో వేసి నిమ్మరసం కూడా వేసి  బాగా కలిపాలి. ఇప్పుడు కొత్తిమీర చల్లి సర్వ్ చెయ్యాలి. 
అంతే ఎంతో రుచిగా ఉండే వాక్కాయ  ఫ్రైడ్ రైస్ రెడీ.