పల్లిల అచ్చులు (Palli Sweet Plates in telugu Verusenaga Achchu)


కావలసిన పదార్దాలు:

పుట్నాలపప్పు : రెండు కప్పులు
పల్లీలు : కప్పు
ఎండు కొబ్బరి ముక్కలు : కప్పు
బెల్లం తురుము  : రెండు కప్పులు
నెయ్యి : రెండు టీ స్పూన్లు

తయారుచేయు విధానం :

1) స్టవ్ వెలిగించి దానిమీద కళాయి పెట్టి నెయ్యి వేసి పుట్నాల పప్పు వేయించాలి. దీనిని మిక్సిజార్ లో వేసి రవ్వలా మిక్సి పట్టాలి.
2) ఇప్పుడు పల్లీలు వేయించి పొట్టు తీసుకోవాలి.ఎండు కొబ్బరిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3) స్టవ్ ఫై మందపాటి గిన్నేపెట్టి దానిలో బెల్లం, కొద్దిగా నీళ్ళు పోసి ఉండ పాకం రానివ్వాలి.
4) ఉండ పాకం వచ్చాక దానిలో రావ్వలా చేసిన శేనగపప్పు పొడి,పల్లీలు పప్పులు, కొబ్బరి ముక్కలు వేసి బాగా కలిపి స్టవ్ ఆపాలి.
5) దీనిని ఒక ప్లేటులోకి తీసుకోని చల్లారు తుండగా ఉండలుగా చుట్టుకోవాలి.