
కావలసిన పదార్దాలు :
మామిడి తురుము : కప్పు
కొబ్బరి తురుము : కప్పు
రవ్వ : కప్పు
నెయ్యి :కప్పు
పాలు : కప్పు
పంచదార : కప్పు
కిస్మిస్ : టేబుల్ స్పూన్
జీడిపప్పు : టేబుల్ స్పూన్
యాలుకుకపొడి : టీ స్పూన్
ఆకుపచ్చ కలర్ : చిటికెడు
తయారుచేయు విధానం:
1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి రెండు స్పూన్లునెయ్యి వేడి చేసి జీడిపప్పులు, కిస్మిస్లు వేయించి తియ్యాలి.
2) తరువాత రవ్వ వేయించి తియ్యాలి. మరో రెండు స్పూన్లు నెయ్యి వేసి మామిడి తురుము వేయించాలి,
3) తరువాత కొబ్బరి తురుము వేసి వేయించాలి.
4) ఇప్పుడు వేయించిన రవ్వవేసి కలిపి, పాలు, పంచదార, యలుకులపొడి వేసి చిన్న మంటమీద ఉడికించాలి.
5)కొన్ని పాలల్లో పచ్చ కలర్ కలిపి ఈ మిశ్రామనికి కలపాలి.
6) బాగా దగ్గరగా అయ్యిన తరువాత స్టవ్ ఆపాలి.
7) దీనిని నెయ్యి రాసిన ప్లేటులోకి వేసి సమంగాసర్ది ఫైన జీడిపప్పులు, కిసిమిస్లు, బాదం పలుకులు వేసి (అద్ది )చల్లారనివ్వాలి.
8) చల్లారిన తరువాత ముక్కలుగా చేసి సర్వ్ చెయ్యాలి.
అంతే గ్రీన్ కలర్లో ఉండే తీపి, పులుపు రుచుల బర్ఫీ రెడీ.