వేపాకుల పచ్చడి (Neem Pickile in telugu Vepaaku Pachchadi)


కావలసిన పదార్దాలు :

వేపాకులు (లేతవి ) : ఒక కప్పు
ఎండు మిర్చి : ఏడు
చింత పండు : పది గ్రాములు
జీలకర్ర : టీ స్పూన్
వెల్లుల్లి : ఒకటి
ఉప్పు : తగినంత
అల్లం : చిన్న ముక్క
నూనె : పావు కప్పు
పోపుదినుసులు : టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు

తయారుచేయు విధానం:

1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. వేప ఆకులు వేసి వేయించాలి. 
2) అదే నూనెలో  ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి  వేయించాలి.
3) ఇప్పుడు మిక్సి జార్లో వేయించిన వేపాకులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, జీలకర్ర  చింత పండు వేసి మెత్తగా  గ్రైండ్ చెయ్యాలి.
4) స్టవ్ మీద నూనె వేడి చేసి పోపుదినుసులు, కరివేపాకు వేసి వేగిన తరువాత రెడిగా చేసి ఉంచిన పచ్చడి లో ఈ తాలింపు వేసి కలిపి వాడుకోవాలి. ఇది షుగర్ ఉన్న వాళ్లకు చాలా మంచిది .