పచ్చ్చిమిర్చి బండ పచ్చడి (Mirchi Chutney in telugu Pachchimirchi Banda Pachchadi)

కావలసిన పదార్దాలు:

పచ్చిమిర్చి : ఇరవై

ఉల్లిపాయలు : రెండు
ఉప్పు : సరిపడా
జీలకర్ర : టీ స్పూన్
వెల్లుల్లి రేకలు : పది
నూనె రెండు : టీ స్పూన్లు
పోపు గింజలు : టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
చింతపండు : నిమ్మకాయంత

తయారు చేయు విధానం:


1) నూనె వేడి చేసి పచ్చిమిర్చి,  జీలకర్ర వేసి వేయించాలి.

2) పచ్చిమిర్చికి  ఉప్పు,వెల్లుల్లి, జీలకర్ర కలిపి మెత్తగా నూరాలి.  తరువాత చింతపండు  వేసి నలిగిన తరువాత  ఉల్లిపాయలు వేసి కచ్చాపచ్చాగానూరాలి. ఉల్లి నలిగీ,నలగకుండా ఉంటే రుచిగా ఉంటుంది.
3) ఇప్పుడు నూనె వేడి చేసి పోపుదినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తరువాత నూరిన ఈ పచ్చడిని వేసి తాలింపు పెట్టాలి.

 అంతే పచ్చిమిర్చి బండ  పచ్చడి రెడీ.